తెలుగు సెక్సు కథలు


రకరకాల ఆధిపత్యాల నుంచి ఒక్క ఉదుటున బయటపడగలిగే తారకమంత్రం  ఏదీ మన దగ్గర లేదిప్పిడు. వ్యక్తిగానైనా, వ్యవస్థకైనా ఈ సూత్రం పనిచేస్తుంది. ఆధిపత్యం బలవత్తరమయినప్పుడు వ్యక్తులు, వ్యవస్థలు దాని వెంటబడిపోవడం సహజం. కాలక్రమంలో అదెంతటి తిరోగమన శక్తిగా పనిచేయగలదన్న తర్కానికి ఇక్కడ తావు లేదు. మనుగడ కోసం పోరాటంలో అంతా సహజంగానే కనిపిస్తుంది. భావ ప్రసారానికి, భావ గ్రహణానికి వాహికగా  ఉండే భాషల విషయంలోనూ ఇదే జరగబోతుందా? అవుననే అంటున్నారు గ్లోబిష్ ఉదంతం తెలిసిన వారంతా!

     అంతర్జాతీయ భాష, భావ ప్రసార వ్యవస్థలలో ‘గ్లోబిష్‘ ఇప్పుడు ఒక కొత్త సంచలనం. గ్లోబల్ - ఇంగ్లీష్ అనే రెండు మాటల సంకరం ‘గ్లోబిష్‘ (ఈ సంకర పద సృష్టికర్త ఎం.ఎన్.గొగాటే - భారతీయుడు. 1988లోనే ఈ పదాన్ని సృష్టించి హిందీ, ఇంగ్లీషు భాషలను వ్యాపార భాషలుగా మార్చే ప్రయత్నం చేసిన మొదటి వ్యక్తి). సరళీకరించిన ఆంగ్ల వ్యవహారంగా గ్లోబిష్ తన పరిధిని, వ్యాప్తిని రోజు రోజుకీ విస్తృతం చేసుకొంటోంది. ఇటలీ, అర్జెంటీనా, చిలీ, బ్రెజిల్, కొరియా, అమెరికా మొదలైన దేశాలలో ఈ భాష కాని ‘భాష‘ పట్ల విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. ఈ దేశాల్లోని బహుళ జాతి సంస్థలలో ఉద్యోగం సంపాదించాలంటే ‘గ్లోబిష్‘ మాట్లాడటం, చదవటం, రాయటం వచ్చి తీరాలన్నది నియమం కాబోతోంది.

     ‘భాష సంస్కృతికి వాహిక. చారిత్రక, సాంస్కృతిక అంశాలు ఏవీ గ్లోబిష్ ద్వారా వ్యక్తం చేయలేం. అంతర్జాతీయ సమాజాలలో మాట్లాడటానికి గ్లోబిష్ ఉపకరణం మాత్రమే‘ అని విస్పష్టంగా ప్రకటించినా గ్లోబిష్‌కు ఆదరణ తగ్గటం లేదు సరికదా పెరుగుతోంది. కాబట్టే గ్లోబిష్ అంతర్జాతీయ అధికార భాష కావాలన్నది తన ఆశయం అంటాడు జాన్ పాల్ నెరియె. ప్రెంచి జాతీయుడైన నెరియె 1980ల్లో అమెరికన్ కంపెనీ ఐబిఎమ్ వైస్ప్రెసిడెంట్ గా ఉండేవారు. విధి నిర్వహణలో జపనీస్, కొరియన్ భాషీయులతో ఏర్పడిన సన్నిహిత సంబంధాలతో ‘గ్లోబిష్‌‘ను అభివృద్ధి పరచాలన్న ఆలోచన తనకు తొలుత కలిగిందంటాడాయన. దరిమిలా ఆయన రాసిన ‘పార్లెజ్ గ్లోబిష్‘ (గ్లోబిష్ మాట్లాడండి) ఇప్పుడు పలు దేశాలలో వృత్తి, ఉద్యోగ రంగాలలో ఉన్నవారికి బైబిల్ గా భాసిల్లుతోంది. ‘మూడో సహస్రాబ్ది ప్రపంచ మాండలీకం‘గా గ్లోబిష్ చాలా దేశాలలో ఇప్పటికే పాదుకొంటోంది. దీని మూలాలు ఆంగ్లంలోనే ఉండటం గమనార్హం.

     నిజానికి ప్రపంచమంతటా వాడుకలో ఉన్న ఆంగ్లం అంతా ఒక్కటి కాదు. దానిలో 176కు పైగా వ్యవహార భేదాలున్నాయి. స్థానిక భేదాలను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ఆసియా ఖండంలోనే ఆంగ్లానికి 16కు పైగా వ్యవహార భేదాలున్నాయి. అంతర్జాతీయంగా ఇటువంటి వ్యవహార భేదాన్ని సూచించడానికి ఆయా దేశాల పేరును ఇంగ్లీష్ అన్న పదంలోని కొంత భాగంలో కలిపి వ్యవహరించటం ఒక పద్ధతి. ఉదాహరణకు చైనాలో వాడుకలో ఉన్న ఇంగ్లీష్ ను ‘చింగ్లీష్‘ అంటారు. మన దేశంలో ఇంగ్లీషు భాషకు 12కి పైగా వ్యవహార భేదాలున్నాయి. ఉత్తర ప్రదేశ్, బీహార్ లలో వాడుకలో ఉన్న ఇంగ్లీష్ కు ‘భయ్యా ఇంగ్లీష్‘ అని పేరు. ఈ రకపు వ్యవహారానికి భిన్నమైన ఆంగ్ల వ్యవహారం మరో నాలుగు రూపాల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఈ మొత్తం భాషా వ్యవహారానికి భిన్నమైన ఆంగ్ల భాషా వ్యవహారం దక్షిణాది రాష్ట్రాల్లో గమనించగలం. ఇన్ని వ్యవహార భేదాలున్నా భావ ప్రసార వ్యవస్థలో ఆంగ్లం తక్కిన భాషలకన్నా ముందు ఎలా ఉండగలుగుతోంది? ప్రపంచ వ్యాప్తంగా 6800 భాషలు వ్యవహారంలో ఉన్నా ప్రపంచ ప్రజలందరి లింక్ లాంగ్వేజిగా ఆంగ్లం ఎలా కొనసాగగలుగుతోంది? ఆయా సమాజాలలోని వ్యక్తుల, వ్యవస్థల అవసరాలు అంతగా ఆంగ్లంలో ఎలా పెనవేసుకొని పోయాయి?

     చారిత్రకంగా ఆంగ్లానికి ప్రపంచమంతటితో సంబంధం ఉంది. ఇంగ్లీష్ పాలన మనల్ని విడిచి ఐదు దశాబ్దాలు దాటినా ఆంగ్ల మనల్ని విడవకపోవడానికి కారణం అంతకు ముందు దాదాపు మూడు శతాబ్దాల చరిత్ర కలిగి ఉండటమే! అందువల్లే ఇప్పటికిప్పుడు మనం ఆంగ్లాన్ని విడిచి ముందుకు పోగలిగే పరిస్థితరిలేదు. పైగా ఆంగ్ల భాషా పరిజ్ఞానం లేనిదే ఆకలి తీరదన్నది మన వ్యవస్థలో బాగా రూఢి అయిపోయిన సత్యం. భాష, వేషం, శైలి… ఒక్క మాటలో మన దైనందిన జీవితాలకు సంబధించిన సర్వ విషయాలూ ప్రత్యక్షంగా ఆ వ్యవస్థతోనే ముడిపడి ఉన్నాయి.

     ప్రపంచ రాజకీయాలు, అత్యాధునిక వాదాలు, ధోరణులు, ఉద్యమాలు… వీటి ఫలితంగా ప్రజలందరి అనుభవంలోకి వచ్చిన విశ్వవ్యాప్త భావన, ఆంగ్ల భాషను ప్రపంచ భాషగా మార్చి వేశాయనటం నిస్సంశయంగా ఒప్పుకోవాల్సిన విషయం. పర్యవసానంగా చాలా దేశాలలో రోజు రోజుకూ భాషలు అంతరించిపోతున్నాయి. చాలా దేశి భాషలు మృత భాషల జాబితాలో చేరిపోతున్నాయి. ప్రపంచ దేశాలన్నిటా అనుసరిస్తున్న మార్కెట్ కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థలు, రాజకీయాలు, మాద్యమ రంగాలు అన్నీ ఇంగ్లీషు శంఖం నుంచే వెలువడి ప్రజలకు చేరుతున్నాయిరు. అంతర్జాతీయ సమాజంలో ఆంగ్ల భాషకు ఉన్న తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రశ్నించే వ్యవస్థలు, వ్యక్తులు లేకపోలేదు. అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొంటూ అంతర్జాతీయంగా మాతృ భాషలను స్థానికీకరించే కార్యక్రమం ఇప్పుడిప్ప్పుడే వేగం పుంజుకొంటోంది. వివిధ భాషలను సమీకరించి, తత్కాల యంత్రానువాదం చేయగలిగే ఆధునిక పరిజ్ఞానం అంతర్జాతీయ సమాజంలో దైనందిన కార్యక్రమంగా మారేంతవరకు మాత్రం ఆంగ్లం ఇప్పటి స్థితిలోనే కొనసాగుతుంది.

     మాతృ భాషల వాడకాన్ని రకరకాల సందర్భాలలో తగ్గించుకొంటూ పోవడం, ఆంగ్లాన్ని విరివిగా ఉపయోగించే సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ఉండటం ‘గ్లోబిష్‌‘కు కలిసివచ్చే అంశాలు. అందువల్లే అది త్వరితగతిన ప్రపంచమంతా వ్యాపించగలుగుతోంది. ఆంగ్ల భాషలో ప్రాచుర్యంగా వాడుకలో ఉన్న1500 పదాలు మాత్రమే గ్లోబిష్‌లో ఉంటాయి. ఈ పదాలలోని వర్ణ క్రమానికి చేసుకొన్న కృతకమైన మార్పులు, అటువంటి పదాలతో ఏర్పడే చిన్న చిన్న వాక్యాలతో వ్యవహారం జరుగుతుంది. వాక్య నిర్మాణంలో ఇంగ్లీష్ వాక్య నిర్మాణాన్ని పోలి ఉండటం వల్ల ఆంగ్ల వ్యాకరణ పద్ధతి ‘గ్లోబిష్‌‘లో కనిపిస్తుంది. కాబట్టి ఆంగ్లంలో కొద్దిపాటి పరిచయం ఉన్నా గ్లోబిష్ త్వరితగతిన నేర్చుకొనే వీలుందని నెరియె వాదం. గ్లోబిష్ వ్యాపార భాష (నెరియె కాదంటున్నా). 15వ శతాబ్ది నుంచి యూరోపియన్ భాషలు ఇతర ఖండాలకు వ్యాప్తి చెందాయి. పోర్చుగీసు భాష అమెరికా, చైనా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా- వంటి ప్రాంతాలలోని స్థానిక భాషలలో కలిసి అనేక వ్యాపార భాషలు ఏర్పడ్డాయి. ఇలా ఏర్పడ్డ వ్యాపార భాషలు ఎవరికీ మాతృ భాషలు కావు. ‘గ్లోబిష్‘ కూడా ఇటువంటిదే. అది ప్రపంచంలోని ఏ భాషా వ్యవహర్తకు మాతృ భాష కాదు. కానీ, ఆర్థిక వ్యవస్థ కేంద్రీకృత సమాజాలను, దేశాలను మాత్రం గ్లోబిష్ విపరీతంగా ప్రభావితం చేయగలదు. ఎందుకంటే అది అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకొంటోంది.

     సాధారణ ఆంగ్ల భాషా పరిజ్ఞానం ఉన్నవారంతా గ్లోబిష్ నేర్చుకొనేందుకు వీలుగా ‘గ్లోలెక్సిస్‘ అనే సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి వచ్చింది. ఆంగ్లంలో మనం ఇచ్చిన పదంలోని ఏ భాగాన్ని తొలగించి లేదా తగ్గించి గ్లోబిష్ పదంగా మార్చుకోవచ్చో ఈ సాఫ్ట్‌వేర్ వివరిస్తుంది. ‘పార్లెజ్ గ్లోబిష్‘ వాచకం ఇప్పటికే ఇటాలియన్, స్పానిష్, కొరియన్, జపనీస్ భాషలలోకి అనువాదమయ్యింది. ప్రపంచ పర్యాటకుల భాషగా ఇప్పటికే గ్లోబిష్ స్థిరపడింది. భవిష్యత్తులో చాలా దేశాలలో ఆరోగ్య, విద్య, తదితర రంగాలలో ‘గ్లోబిష్‘ ప్రవేశించబోతోంది. బహుళజాతి సంస్థల్లో స్థిరపడ్డ భారతీయ యువత గ్లోబిష్ నేర్చుకోటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. సరళీకృత ఆర్థిక రంగ ప్రభావంతో వచ్చే విదేశీ కంపెనీలలో భారతీయులకు చోటు దక్కాలంటే ‘గ్లోబిష్‘ గడప తొక్కటం తప్పకపోవచ్చు. ఈ సందర్భంలో మాతృ భాషల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకం! ప్రపంచ దేశాలకు సంస్కృతిని, సాహిత్యాన్ని, జ్ఞానాన్ని అందించి మానవీయ విలువలను పెపొందించి, తద్వారా నాగరికతను నేర్పిన ఇటాలియన్, జర్మన్, స్పానిష్, సంస్కృతం మొదలైన భాషలు ఏం కాబోతున్నాయనేది జటిలమైన సమస్య. ఈ మాటనే నెరియెను అడిగినప్పుడు ‘సంస్కృతి వాహికలుగా భద్రపరచాల‘ని సమాధానమిచ్చాడు. బహుభాషా ప్రాంతాలైన భారతీయ సమాజంలో ఈ పని కష్ట సాధ్యమే కాని, అసాధ్యం మాత్రం కాదు. చరిత్ర, సంస్కృతి, నాగరికత మొదలైన అంశాలన్నిటితో ముడిపడి ఉన్న మాతృ భాషలను కాదని ఏ జాతి మనగలదు? వ్యాపార భాషలు సమాజంలో ఉన్నతిని కలిగించగలవేమోగాని మనసును ఉదాత్తీకరించలేవు. మానవతను పెంపొందించలేవు.ఈరెండూ అనుభవంలోకి రావాలన్నా రేపటి రోజు అర్థవంతంగా గడపాలన్నా - ఒకటికి మించి భాషలు నేర్వాల్సిందే

అన్నమయ్య ప్రారంభించిన పదకవిత్వం తెలుగు సాహిత్యంలో నూతన కవితా సంప్రదాయాన్ని ఆవిష్కరించింది. ఆయన రచించినట్లుగా చెప్పుకునే 32 వేల సంకీర్తనల్లో దాదాపు 14.5 వేల సంకీర్తనలే లభ్యమయినా, అవి అనంతమైన వైవిధ్యానికి, నూతన భావ ప్రకటనకు వీలు కల్పించిన రచనలు. ఆయన రచనల పట్ల ఎంత ఆకర్షణ ఉందో, అన్నమయ్య వ్యక్తిగత జీవితమూ అంతటి ఆసక్తిదాయకం. అన్నమయ్య కవిత్వంతో పెనవేసుకొనిపోయిన ఆయన జీవితాన్ని నేటికీ తెలుగులో అనేకమంది పరిశోధకులు వివరించి ఉన్నారు. ఆ సంప్రదాయంలో వినూత్నంగా, విశిష్టంగా ఆవిష్కృతమైన గ్రంథం – ‘God on the Hill’ . అన్నమయ్య రచనల్లో ఆయన కవిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే నూరు ప్రాతినిధ్య కవితలను ఆంగ్లంలోకి అనువదించారు – విఖ్యాత పరిశోధక, అనువాదకులు వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షుల్మన్ గారులు. తెలుగు సాహిత్యంతో గాఢమైన అనుబంధం మాత్రమేగాక, సొగసైన ఆంగ్లంలో పెట్టగలిగిన కవితా హృదయులు గావడం వల్ల అన్నమయ్య పాదాలకు ఎంతటి లాలిత్యమూ, సౌకుమార్యమూ ఉన్నాయో, ఆంగ్లంలోనూ అంతటి మార్దవం సమకూర్చారీ అనువాదకులు.

అన్నమయ్యను ఆంగ్లంలో పరిచయం చేసినవారిలో అడపా రామకృష్ణ రావు గారి కృషి శ్లాఘనీయం. వారు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణ కోసమై రాసిన పుస్తకంలో అన్నమయ్యను అత్యంత సమర్థవంతంగా ప్రదర్శించి ఉన్నారు. కానీ, ఆ పుస్తకం పరిధి చిన్నది కావడం వల్ల పరిమితులున్నాయి. ప్రస్తుతానువాద గ్రంథం విస్తృతమైనదేగాక, కవితానువాదాన్ని గ్రహించి తర్వాత ఆ కవి రచన ఏ కాలం నాటిదో, ఏ సందర్భంలో కావ్యం వెలువడిందో వివరించే విపుల పరిశోధనాత్మక వ్యాసం సమకూర్చడం ఈ అనువాదక పరిశోధకులు నిర్వహించిన ప్రత్యేక కృషి.

అన్నమాచార్య జీవితాన్ని అధ్యయనం చేయడానికి గొప్ప ఆకర గ్రంథం – ఆయన మనవడే ( తాళ్ళపాక చిన్నన్న/ తిరువేంగళనాథుడు ) రచించిన ‘అన్నమాచార్య జీవిత చరిత్రము’. అది చిన్న ద్విపద కావ్యమే అయినా వేటూరి ప్రభాకరశాస్త్రి గారు ఎంతో విపులమైన పీఠిక సమకూర్చి అన్నమాచార్య జీవితానికి, కవిత్వానికి ఉన్న సంబంధాన్ని అతి సమర్థంగా స్థాపించారు. నేటికీ ప్రభాకర శాస్త్రి గారి పీఠిక మౌలిక విషయాలను గ్రహించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంది. అన్నమాచార్య సాహిత్యాన్ని లోకానికి పరిచయం చేయడంలో వేటూరి ప్రభాకరశాస్త్రి గారు, రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు చూపిన వైదుష్యం లోకమంతా గౌరవించింది. ఈ అనువాదక, పరిశోధక గ్రంథంలోనూ వారి కృషిని స్మరించడం అనువాదకుల విజ్ఞతకు నిదర్శనం.

అన్నమయ్య విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అనుసరించినవాడు. ఆ సిద్ధాంతం ద్వైధీభూతమెలాగో ఆయన కవిత్వమూ ద్విధావిభజితం. భగవత్కీర్తనకై పరమ ఆధ్యాత్మిక సంకీర్తనలు ఎలా రచించాడో, వెంకటేశ్వరుడు ఆయన ఇరువురు భార్యలు – అలమేలు మంగ , పద్మావతుల శృంగారాన్ని రసరమ్యంగా కీర్తించాడు. భక్తుడైన వ్యక్తి ఆ శృంగార సంకీర్తనలను నాయక, నాయికలు అలౌకికులని భావిస్తే అవి భగవదారాధనలో భాగమవుతాయి. ఆ శృంగార సంకీర్తనలు భగవంతునికి సంబంధించినవని భక్తుడు నిరంతరం భావిస్తూ ఉండాలి. భక్తుడు/ శ్రోత/ పాఠకుడు ఆ పాత్రల్లో తాదాత్మ్యమవడానికి వీలు లేదు. అప్పుడవి పరమలౌకిక శృంగార గీతాలయ్యే ప్రమాదముంది. అన్నమాచార్యుడిని తన ఆస్థానానికి ఆహ్వానించి వేంకటేశ్వరుడి పై పాట పాడుమన్న సాళువ నరసింహరాయుడు ‘ఏమొకో చిగురుట ధరమున’ అనే రమ్యమైన గీతాన్ని విని, తనపైగూడా అటువంటి కీర్తనే పాడుమని అనడం, నరసింహరాయుడు ఆ పాత్రలో తాదాత్మ్యమవడం వల్లే జరిగింది. ‘నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరుల నుతింపగ నోపదు జిహ్వ’ అని అన్నమయ్య సున్నితంగా తిరస్కరించాడు. ఆ సందిగ్ధావస్థలోని సంక్లిష్ట స్థితిని ఈ పరిశోధకులు అతి సున్నితంగా విశదీకరించారు – తమ After word లో.

అన్నమాచార్య సంకీర్తనలను, వాటి అనువాదాలను ఈ క్రింద పొందుపరచదలిచాను. మానవుని ఏకాగ్రతా స్వరూపమే దైవమని వర్ణించడానికి అన్నమయ్య మంచి సంకీర్తన కూర్చారు -ఆయన,


మనకు కథలు కొత్తవేం కాదు. చిన్నప్పటి నుండి కథలు వింటునే ఉన్నాం. చిన్నప్పుడు ప్రతీ రోజు అమ్మమ్మ దగ్గరో, నాన్నమ్మ దగ్గరో, అమ్మ ఒళ్ళోనో కూర్చుని కథలు వినేఉంటాం. ఆ కథలు సామాన్యంగా ” అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. వాళ్ళంతా కలిసి వేటకు వెళ్ళారు…” అనే రీతిలోనే ఎక్కువగా ప్రారంభమవుతాయి. ఈ కథలు ఆ రాజులు, రాజ కుమారుల గురించి చెప్పటమే కాక మనకు నీతిని, విజ్ఞానాన్ని కూడా అందిస్తాయి. అలాంటిదే రా.వి. శాస్త్రి రాసిన కథ “పాతదే కథ”.

   రా.వి. శాస్త్రి “పాతదే కథ” కూడా “అనగనగా ఒక భూకామందు. ఆయనకు ఏడుగురు కొడుకులున్నారు. వాళ్ళంతా కూలీల వేటకు వెళ్ళారు…” అనే పాత పద్ధతిలోనే ప్రారంభమయింది. అయితే చెప్పిన పద్ధతి పాతదే అయినా ఇందులోని విషయం కొత్తది. పాత కథల్లో మనకు రాజులు, రాకుమారులు కనిపిస్తే ఈ కథలో భూకామందు అతని కొడుకులు కనిపిస్తారు..

   ఈ కథలో భూకామందు ఏడుగురు కొడుకులు వేటకి వెళ్ళి ఏడుగురు ఎండు కూలీలను తెచ్చి వారి చేత బండ రాళ్ళను తవ్విస్తారు. ఒకరోజు వాళ్ళలో ఒకడు ఎండకు తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోతాడు. అప్పుడు భూకామందు కొడుకులు తమ సెక్రటరీని, సెక్రటరీ మేనేజరునీ, మేనేజరు లేబర్ ఆఫీసర్‌నీ, లేబర్ ఆఫీసర్‌ డాక్టర్‌నీ పిలుస్తారు. డాక్టర్ వచ్చి ఆ ఎండుకూలీని చూసి ‘నూరేళ్ళు నిండి చనిపోయాడు’ అని చెప్పి బిళ్ళు తీసుకొని వెళ్తాడు. భూకామందు కొడుకులకు అనుమానం కలిగి డాక్టర్‌ని రహస్యంగా అడగగా ‘తిండిలేక పోవటం వల్లనే చనిపోయాడని’ చెప్తాడు. దాంతో వారంతా సమావేశమవుతారు. అప్పటికే కూలీలకు మంచినీళ్ళు ఇస్తున్నామని, ఇప్పుడు పచ్చమన్ను ఇస్తే వారికి వస్తున్న 200 రూపాయల లాభంలో పావలా నష్టం కలుగుతుందని పెద్దవాడు చెప్తాడు. దీంతో కొడుకులంతా కూలీలకు నీళ్ళు తప్ప ఏమీ ఇవ్వరాదని నిర్ణయించుకుంటారు. తర్వాత మిగతా ఆరుగురు ఎండుకూలీలు చస్తారు. యజమానులు మళ్ళీ వేటకు వెళ్ళి  మరో ఏడుగురు కూలీలను పట్టుకు వస్తారు. ఇలా ఐదుసార్లు జరుగుతుంది. అపుడు యజమానులకు 200 రూపాయలకు  బదులు 150 రూపాయల లాభం మాత్రమే వస్తుంది.

   ఏడుగురు కొడుకులు గుండెలు బాదుకుంటూ నాన్న భూకామందు దగ్గరకు వెళ్తారు. వారి మాటలు విన్న భూకామందు ‘మనం బతకాలంటే కూలీలు చావకూడదు. వారు కూడా బతకాలి. చస్తే లాభం ఉండదు కనుక వారిని కొన ఊపిరితో ఉంచాలి . అందుకే వారికి ఇంత గడ్డి వేయండి. అప్పుడప్పుడు ఇంకా ఎక్కువగా గడ్డి పెట్టండి. కానీ, చదువు మాత్రం అందించకండి. ఇంకా సెక్సు సినిమాలు చూపించండి. సురాపానం చేయించండి. మరొక రెండు గడ్డి పరకలు పడవేయండి. కానీ, వారు విజ్ఞాన దీపాలు వెలిగించుకోకుండా చూడండి’ అని చెప్తాడు.

   నాన్నగారి ఉపదేశం విన్న ఏడుగురు కొడుకులు ఆ రోజు నుండి కూలీలకు రెండు గడ్డి పరకలు, మూడు చుక్కలు ఉప్పునీరు అందించటం మొదలుపెట్టారు. ఆ తర్వాత వారంతా ఒక చోట చేరి “ఇదే ఇదే సోషలిజం” అన్నారు. అపుడు కొందరు కూలీలు కార్మిక నాయకులుగా మారి “అవునిదే సోషలిజం” అని అరచి కంపెనీ డాక్టరు లాగానే వాళ్ళు  కూడా డబ్బులు పుచ్చుకుని ఇంటికి వెళ్తారు. అయితే ఇందుకు బిళ్ళులు మాత్రం ఉండవు.

   స్థూలంగా ఇదీ కథ. కథ అంతా అయ్యాక “పెద్దవాళ్ళు కథ కంచికి మనమింటికి” అంటుంటారు. కానీ, రచయిత “ఈ కథ కంచికి వెళ్ళలేదు అంటాడు” అంటాడు. “ఎందుచేతనంటే ఎండు కూలీలు ఎండలోనే ఉన్నారు. భూకామందులు, వ్యాపారపు కొడుకులు లాభాల వేటలో ఇంకా ఈ లోకంలోనే మన పీకల మీద ఉన్నారు” అని కారణం చెప్తాడు. ఈ కథ అప్పుడే కాదు ఇప్పుడు కూడా కంచికి చేరలేదు అని చెప్పవచ్చు.

   ఈ కథ పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మికుల కష్టాలను, యజమానులు లాభాలను పొందే విధానాన్ని తెలుపుతుంది. సమాజం భూస్వామ్య వ్యవస్థ నుండి అప్పుడే పెట్టుబడిదారీ వ్యవస్థకు పరిణామం చెందుతున్న దశను ఈ కథ చిత్రించింది. ఈ కథలో భూస్వామ్య వ్యవస్థకు భూకామందు,  అతని కొడుకులు పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రతీకలుగా కనిపిస్తారు. ఇందులో భూస్వాములే పెట్టుబడిదారులుగా మారిన వైనం చూడవచ్చు.  భూస్వామ్య వ్యవస్థ లో సంపద అంతా ఒకరి చేతుల్లోనే ఉండటం వల్ల రైతులే కూలీలుగా మారారు. అందువల్లనే భూకామందు కొడుకులకు ఐదుసార్లు ఏడుగురు కూలీలు తక్కువ కూలీకే లభిస్తారు. వారితో భూస్వామి కొడుకులు భూమిలో రాళ్ళను తవ్విస్తారు. భూమిలోని రాళ్ళు ప్రకృతి సంపద. దాన్ని వెలికి తీయడానికి యజమానులు పెట్టుబడి పెట్టనవసరం లేదు. కేవలం కూలీలచే పని చేయించి వారు లాభాన్ని పొందుతారు. దానికి ప్రతిఫలంగా వారు కూలీలకు మంచి నీళ్ళు ఇస్తారు. ఇది కూడా ప్రకృతి సంపదే. కాబట్టి యజమానులు లాభాలు పొందటమే తప్ప నష్టం పొందటం అంటూ ఉండదు. ఈ లాభాలకు రుచి మరగటం వల్లనే కార్మికుల తిండి కోసం తమ లాభంనుండి కేవలం పావలా వదులుకోవడానికి కూడా సిద్ధపడరు. చివరకు లాభాలు తగ్గడం వల్ల తండ్రి సలహాపై కూలీలకు తిండి పెడతారు. అది కూడా వారు చావకుండా, బతకకుండా ఉండటానికి. ఇది కేవలం యజమాని ప్రయోజనం కోసమే  తప్ప కార్మికుని సంక్షేమం కోసం కాదు.

   పెట్టుబడిదారీ వ్యవస్థలో యజమానులు, కార్మికులు మాత్రమే కాకుండా మరికొంత మంది ఉద్యోగులు ఉంటారు. వారే ఈ కథలో మేనేజరు, సెక్రటరీ, లేబరు ఆఫీసరు, డాక్టరు. వీళ్ళలో లేబర్ ఆఫీసర్, డాక్టర్ కార్మికుల సంక్షేమం కోసం నియమింపబడ్డవాళ్ళు. వాళ్ళు కార్మిక సంక్షేమం కన్నా యజమాని లాభాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు.  కార్మికుని సంక్షేమం చూడాల్సిన లేబరు ఆఫీసరు సమయానికి డాక్టరుని తీసుకు రాకుండా అశ్రద్ధ వహిస్తాడు. దీంతో డాక్టర్ రావటం ఆలస్యం అయి కూలీ మరణిస్తాడు. వచ్చిన డాక్టర్ కూడా కూలీల ముందు నిజాన్ని కప్పి పెట్టి యజమాని లాభానికి దోహదపడతారు. తద్వారా తాను బిళ్ళు (డబ్బులు) పొందుతాడు. ఇది కూలీ వైద్యం కోసం ఖర్చు చేయబడటం వల్ల యజమానికి ఆ సొమ్ముపై ఆదాయపన్నునుండి మినహాయింపు కూడా ఉంటుంది యజమానికిది మరో విధంగా లాభం. కార్మికుల సంక్షేమం కోసం కార్మికులతో ఎన్నుకోబడ్ద నాయకులు కూడా డబ్బుకాశపడి యజమానికే వంత పాడతారు.

   ఈ విధంగా ఈ కథలో పెట్టుబడిదారీ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని కళాత్మకంగా చిత్రించాడు రావి శాస్త్రి.  ఈ నాటికి కూడా ఈ కథ అన్వయమవుతుందని చెప్పువచ్చు.ఈ కథలో భూకామందు కొడుకులకు ఒక సలహా చెప్తాడు. ‘కూలీలకు అవసరమైతే రెండు గడ్డి పరకలు ఎక్కువగానైనా వేయండి. కానీ, చదువు మాత్రం అందించకండి’ అని చెప్తాడు. ఇది భూస్వాములు పాటించారు. తర్వాతి పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇది సాధ్యం కాలేదు. తమకు కావలిసిన ఉద్యోగాల కోసం వారికి చదువు అందించాల్సి వచ్చింది. సెక్సు సినిమాలు, సారాయి అలాగే కొనసాగుతున్నాయి.

   పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచీకరణ పేరుతో వికృతరూపం దాల్చింది. ఆ వ్యవస్థను ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. కార్మికుల కష్టాలు ఇంకా ఎక్కువవుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారుల లాభాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అందుకే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారితో పాటూ బిలియనీర్లూ పెరుగుతున్నారు. ఈ మధ్యనే ప్రకటించిన బిలియనీర్ల జాబితాలో (జపాన్‌ లాంటి దేశాల్ని తోసివేసి) భారతీయుల సంఖ్య పెరగటం చూస్తూనే ఉన్నాం. వారు తమ పెట్టుబడులతో చిన్నచిన్న వ్యాపారాలను కూడా స్వాధీనం చేసుకుని లాభాలను ఆర్జిస్తున్నారు. ఆఖరుకి నెట్టుడు బండ్లపై సామానులను అమ్మేవారిని కూడా తమ కూలీలుగా మార్చుకుని లాభాలను ఆర్జిస్తున్నారు.

   ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండళ్ళ పేరుతో రైతుల దగ్గరి నుండి భూములను లాక్కొని మరీ పెట్టుబడిదారులకు పంచి పెడ్తున్నది . వారికి రాయితీలను, పన్ను మినహాయింపులను ఇస్తున్నది. రైతులకు ఉపాధి చూపిస్తున్నాం అనే నెపంతో స్వయంగా బ్రతికే వారిని కంపెనీలలో కూలీలుగా మారుస్తున్నది. ప్రతిఘటించిన వారిని చంపేస్తున్నది. పెట్టుబడిదారుల ఆదాయాన్ని కూడా లెక్కిస్తూ (ఈ కథలోని వ్యాపారులు, కార్మిక నాయకులు లాగా) “సోషలిజం” సాధిస్తున్నామని చెప్పుకుంటున్నది. అలాగే  (ఈ కథలో భూకామందు చెప్పినట్లుగా) ప్రజలను ఆలోచించనీయకుండా సెక్సు సినిమాలను, మద్యపానాన్ని విపరీతంగా ప్రోత్సహిస్తున్నది. ప్రజలకు పెట్టుబడిదారీ వ్యవస్థకు కావలిసిన చదువును మాత్రమే అందిస్తున్నది. మేనేజ్‌మెంటు, ఇంజనీరింగు, ఇంగ్లీషు విద్యలను ప్రోత్సహించటం సామాజిక శాస్త్రాలను నిర్వీర్యం చెయ్యటం ఇందులో భాగంగా చెప్పవచ్చు.

  ఇలా రా.వి. శాస్త్రి “పాతదే కథ” అనే పేరుతో కొత్త కథను రచించాడు. కొత్త వస్తువుని తీసుకుని “పాతదే కథ” లో కొత్తదనం చూపించాడు. ఈ కథ ఈ నాటికి కూడా కంచికి చేరక పోవటం, నేటి పరిస్థితులకు కూడా అన్వయింపబడటం మనం ఆలోచించదగ్గ విషయం.